సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు
సచివాలయాల తనిఖీ
కర్నూలు కలెక్టరేట్/ కోడుమూరు, జూన్ 03, (సీమకిరణం న్యూస్):
లద్దగిరి గ్రామంలోని గ్రామ సచివాలయం 1 మరియు 2 లను కలెక్టర్ తనిఖీ చేశారు.. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు సిబ్బందిని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, ఓటీఎస్ తదితర రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. సచివాలయ పరిధిలో మురుగు కాలువలు, చెత్త తొలగింపు కు చర్యలు తీసుకోవాలన్నారు .వాలంటీర్లు తప్పకుండా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని కలెక్టర్ అదేశించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని, సకాలంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్దిదారులకు రిజిస్ట్రేషన్, స్కానింగ్ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వార్డు పరిధిలో OTS క్రింద ఎంతమంది పైకం చెల్లించారు, రైతు భరోసా కేంద్రానికి రైతులు వస్తున్నారా వంటి వివరాలను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించడం లో ముందుండాలన్నారు.. ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు..