ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
జగనన్నగృహాల నిర్మాణాలు వేగవంతం అయ్యేలా చురుగ్గా వ్యవహరించాలి
జగనన్న గృహాల నిర్మాణాలు వేగవంతం అయ్యేలా సిబ్బంది చురుగ్గా వ్యవహరించాలి
జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు
జగనన్న కాలనీ లేఅవుట్ల పరిశీలన
కర్నూలు కలెక్టరేట్/కోడుమూరు, జూన్ 03, (సీమకిరణం న్యూస్) :
కోడుమూరు మండలం ఎర్రదొడ్డి గ్రామం సమీపంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద
జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు పరిశీలించారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లబ్దిదారులను ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు.. కాలనీలోని 14 ఇళ్లు బేస్మెంట్ లెవెల్ కు వచ్చాయని, మిగిలిన ఇళ్లను కూడా ఈ స్థాయికి తీసుకురావాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు..