7న పల్నాడు జిల్లాలో సీఎం “జగన్”
7న జిందాల్ పవర్ ప్రాజెక్ట్ ప్రారంభం

ఈ నెల 7న పల్నాడు జిల్లాలో సీఎం “జగన్” చేతుల మీదుగా జిందాల్ పవర్ ప్రాజెక్ట్ ప్రారంభం
పల్నాడు జిల్లా బ్యూరో, జూన్ 03, ( సీమకిరణం న్యూస్) :
ఈ నెల జూన్ 7న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి జిందాల్ పవర్ ప్రాజెక్ట్ ప్రారంభం చేయనున్నందున, ప్రాజెక్ట్ పరిసరాల్లో పైలాన్, గ్రీనరి, పారిశుధ్య పనులను పక్కాగా చేపట్టాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సిడిఎంఏ) ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర గ్రీనరి అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ ఎండి రాజశేఖర్ రెడ్డి,పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి, జిల్లా యస్.పి. రవిశంకర్ రెడ్డి, అడిషనల్ యస్.పి. బిందు మాధవ్, గుంటూరు నగర కమిషనర్ కీర్తి చేకూరి గార్లతో కలిసి యడ్లపాడు మండలం, కొండవీడు గ్రామ రెవెన్యూ పరిధిలోని కొత్తపాలెం పంచాయతీ – నాయుడుపేట శివారులోని జిందాల్ పవర్ ప్రాజెక్ట్ ని పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసే మార్గాలను, హెలిప్యాడ్ కోసం అవసరమైన స్థలాలను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై నగరపాలక సంస్థ, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ అధికారులు మరియు జిందాల్ ప్రతినిధులతో చర్చించారు.
ఈ సందర్భంగా సిడిఎంఏ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సుమారు రూ. 345 కోట్ల వ్యయంతో 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల జిందాల్ పవర్ ప్రాజెక్ట్ ఫ్యాక్టరీ ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు. అనంతరం జిందాల్ పవర్ ప్రాజెక్ట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలన చేస్తారని,ప్లాంట్ లో ప్రారంభోత్సవ పైలాన్ ఏర్పాటుకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాంట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన హరిత వనాలు మోడల్ ఎవెన్యు ప్లాంటేషన్ ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలిస్తారన్నారు. గుంటూరు నుండి జాతీయ రహదారి పక్కన ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ప్లాంట్ లో సభావేదిక ఏర్పాటును పరిశీలించి పలు సూచనలు చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోలన్నారు. ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో గ్రీనరి పెంపుదలకు, ఎవెన్యు ప్లాంటేషన్ కు అర్బన్ గ్రీనరి కార్పోరేషన్ అధికారులు వేగంగా పనులు చేపట్టాలని, అలాగే స్టాల్స్ ఏర్పాటుకు మార్కింగ్ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం జిందాల్ ప్రతినిధులతో ప్లాంట్ మ్యాప్ పై చర్చించి, ముఖ్యమంత్రి ప్లాంట్ లోకి వచ్చే, వెళ్ళే మార్గాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఆర్.డి.ఓ. ప్రభాకర రెడ్డి, నరసరావుపేట ఆర్.డి.ఓ. శేషి రెడ్డి, జిందాల్ ఏపి ప్రాజెక్ట్స్ ప్రెసిడెంట్ చారి, ఏ.జి.ఎం. రామకృష్ణ, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, యస్.ఈ. డి.శ్రీనివాస్,ఏ.డి.హెచ్. రామారావు, సి.ఎం.ఓ.హెచ్ డాక్టర్ విజయలక్ష్మీ , యడ్లపాడు తాహశీల్దార్ నాగమల్లేశ్వరరావు, ఎంపీడీవో మాధురి తదితరులు పాల్గొన్నారు.