సీనియర్ జర్నలిస్ట్ పంచాంగ్నుల చంద్రశేఖర్ మృతి జర్నలిస్ట్ లోకానికి తీరని లోటు.
చంద్రశేఖర్ మృతి కి ఏపీ డబ్ల్యూజేఎఫ్ సంతాపం..
నంద్యాల క్రైమ్, జూన్ 04, (సీమకిరణం న్యూస్):
సీనియర్ జర్నలిస్ట్ పంచాంగ్నుల చంద్రశేఖర్ మృతి జర్నలిస్ట్ లోకానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపి డబ్ల్యూజేఎఫ్ ) నంద్యాల నియోజకవర్గం కమిటీ పేర్కొంది. చంద్రశేఖర్ మృతికి ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు మాదాల శ్రీనివాసులు, నియోజకవర్గం అధ్యక్ష, కార్యదర్శులు శివ, జగన్ మోహన్ లు శనివారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నంద్యాల పట్టణంలో అనేక సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా వుంటూ సమాజభివృధిలో భాగస్వామి అయ్యారన్నారు. విద్యార్ధి ఉద్యమం నుండి వచ్చి, వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్ గా పని చేస్తూ నిబద్దతకు, నిజాయితీ కి బద్దుడిగా ఉంటూ చంద్రశేఖర్ పనిచేశారని ఆయన సేవలను గుర్తు చేశారు. అటువంటి జర్నలిస్ట్ ను కోల్పోవడం యావత్ జర్నలిస్ట్ లోకాన్ని దిగ్బ్రాంతికి గురైయరన్నారు. నిజాయితీ కలిగిన సీనియర్ జర్నలిస్ట్ ను కోల్పోవడం బాధాకరమని, ఆయన లేని లోటు జర్నలిజంలో తీర్చలేనిదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.