రూల్స్ పాటించకపోతే ఫైన్ తప్పదు
రూల్స్ పాటించకపోతే ఫైన్ తప్పదు.
ఎస్సై టీ. వెంకటరమణ
నెల్లూరు, ఆత్మకూరు, మర్రిపాడు, మార్చి 10, ( సీమకిరణం న్యూస్) :
జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు మర్రిపాడు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో నో పార్కింగ్ ఏరియాలలో రూల్స్ అతిక్రమించి వాహనాలు నిలుపుదల చేసిన వారికి మరియు బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులకు స్థానిక ఎస్ఐ వెంకటరమణ అపరాధ రుసుం విధించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ వెంకటరమణ మాట్లాడుతూ బస్టాండ్ ఆవరణలో వాహనదారులు తమ యొక్క వాహనాలను గంటల వ్యవధిలలో షాపులో కి ఎదురుగా రోడ్డుమీద నిలపడం వలన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని తద్వారా వచ్చేపోయే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని కావున షాపులో తమ అవసరాల కొరకు వచ్చేవారు ఎక్కువ సమయం కాలయాపన చేయకుండా త్వరతగతిన తమ పనులను చూసుకొని వెళ్లాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటరమణ వెంట హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, శ్రీను ,మహిళా పోలీసులు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.