శ్రీ మద్దిలేటి స్వామికి అధిక సంఖ్యలో భక్తులు
శ్రీ మద్దిలేటి స్వామికి అధిక సంఖ్యలో భక్తులు
నంద్యాల క్రైమ్, జూన్ 04, (సీమకిరణం న్యూస్) :
బేతంచర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారులో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటాను కోట్ల భక్తుల ఆరాధ్య దైవం శ్రీ మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం శ్రీ స్వామి అమ్మవారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు వేకువజాము నుండి అభిషేకాలు గండ దీపాలు పుట్టు వెంట్రుకలు తలనీలాలు వంటి మొక్కలు చెల్లించుకున్నారు. తద్వారా దేవస్థానమునకు శ్రీ స్వామి వారి సేవా టికెట్లు లడ్డు ప్రసాదము , కేశఖండనము, రూము బాడుగ లు మొదలగు వాటి ద్వారా రూ.8,15,603/- ఆదాయం వచ్చినది. ఇందులో భక్తులు కర్నూలు జిల్లా మానవపాడు మండలం ఏ బూడిదపాడు గ్రామనికి చెందిన,యు.గోపాల్ ,యు. మహేశ్వరమ్మలు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి 950 గ్రాముల బరువు గల వెండి వడ్డానం దేవస్థాన సిబ్బందికి సమర్పించారు. స్వామి వారి దర్శనార్థం దేవస్థానమునకు వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 ఆంక్షలను పాటించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పాండురంగారెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ సిహెచ్ లక్ష్మి రెడ్డి , సూచించారు.