
కందిలో వైరస్ మరియు ఎండు తెగులు తట్టుకునే రకాలు ఉన్నాయి…సాగు చేయండి
నంద్యాల క్రైమ్, జూన్ 04, (సీమకిరణం న్యూస్) :
బేతంచర్ల మండల వ్యవసాయ శాఖ అధికారి జి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ కంది పంట గత సంవత్సరం వైరస్ వల్ల చాలా పంట దెబ్బ తిని దిగుబడి చాలా తగ్గి రైతులు బాగా నష్ట పోయారని ఈ విషయాన్ని రైతులు దృష్టిలో ఉంచుకొని వైరస్ మరియు ఎండు తెగులు ను తట్టుకునే రకాలు ఎంచుకోవాలని అన్నారు.అలాగే ఎల్ఆర్జీ105 మరియు టిఆర్జీ 59 అనే రకాలు వైరస్ ను మరియు ఎండు తెగులును తట్టుకుంటుంది ..ఈ రెండు రకాలు కృషి విజ్ఞాన కేంద్రం , బ నవాసి లో అందుబాటులో ఉన్నాయి . ఒక కేజీ విత్తనం ధర ₹110/- ఉంటుంది , కావలసిన రైతులు కృషి విజ్ఞాన కేంద్రం , బనవాసీ లో తెచ్చుకోవచ్చునని ఎల్ఆర్జీ 105 రకం 180 రోజుల పంట కాలం ఉంటుంది .మరియు టిఆర్జీ59 170 రోజుల పంట కాలం ఉంటుంది.అని తెలిపారు.