చేతులు కలిసె… స్నే”హితం” విరిసె
చేతులు కలిసె… స్నే”హితం” విరిసె
చిట్యాల, జూన్ 03, (సీమకిరణం న్యూస్) :
ఆట పాటలు, సంతోష సమయంలోనే కాదు.. ఆపదలోనూ అండగా ఉంటామని నిరూపించారు ఆ బాల్య స్నేహితులు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన శేపూరి రామారావు ఇటీవల మృతి చెందాడు.వీరిది పేద కుటుంబం. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. 1998- 99 విద్యా సంవత్సరంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన రామారావు బాల్య మిత్రులు కుటుంబానికి ఆపన్నహస్తం అందించారు. బాధితుని మిత్రులు సేకరించిన రూ.62,511లను అతని కుమార్తె పేరున ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. శుక్రవారం డిపాజిట్ చేసిన పత్రాన్ని భాదితుని భార్యకు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు రూపని లింగస్వామి, బుట్టి వెంకటేశం, చెరుకు పాండు, బొంతల నరేందర్ రెడ్డి, నవీన్, నాతి శ్రీను, మేడి ఈశ్వర్, బ్రహ్మచారి, కంచుకుమ్ముల శ్రీను, అరూరి శ్రీను, అరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.