గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేలా క్రీడా ప్రాంగణాలు
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేలా క్రీడా ప్రాంగణాలు : – ఎమ్మెల్యే చిరుమర్తి
చిట్యాల, జూన్ 04, (సీమకిరణం న్యూస్) :
దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్క్ పాలన సాగుతోందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఆరెగూడెం గ్రామంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ఆయన శనివారం ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలసి కాసేపు ఆటలు ఆడారు. రాష్ట్రంలో పల్లెప్రగతి ద్వారా గ్రామాల రూపురేకలు మారాయని, ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న ప్రతిభ గల యువతీ, యువకులను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్, ఎంపీవో పద్మ, సర్పంచ్ అరూరి లాలమ్మ స్వామి, ఎంపీటీసీ సభ్యురాలు ముద్దసాని నీతారమణారెడ్డి, ఉప్పరబోయిన అంజమ్మ స్వామి, సింగిల్విండో చైర్మన్ రుద్రారపు భిక్షపతి, తెరాస మండలాధ్యక్షుడు ఆవుల అయిలయ్యయాదవ్, ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు గుండె రమేష్, సిందె ఆంజనేయులు, మోకిడి వినయ్ తదితరులు పాల్గొన్నారు.