BREAKING NEWSCRIMEPOLITICSSTATETELANGANA
బొడ్రాయికి ఎమ్మెల్యే చిరుమర్తి ప్రత్యేక పూజలు

బొడ్రాయికి ఎమ్మెల్యే చిరుమర్తి ప్రత్యేక పూజలు
చిట్యాల, జూన్ 04, (సీమకిరణం న్యూస్) :
చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో బొడ్రాయి, కట్టమైసమ్మ గ్రామ దేవతల ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి శనివారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై దేవతలను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామదేవతల ఆశీస్సులు గ్రామంపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలను సంతోషంగా చూడాలని వేడుకున్నారు. అనంతరం దేవాలయాల అభివృద్ధికి రూ. 75వేలు విరాళాన్ని ఆలయ అభివృద్ది కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి మర్రి జలెందర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు ముద్దసాని నీతా రమణారెడ్డి, ఉప సర్పంచి నూతి సత్యశ్రీ వెంకటేశం, తెరాస మండల అధ్యక్షుడు ఆవుల అయిలయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, మోకిడి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.