చైల్డ్ అశ్రమంను సందర్శించిన అదనపు ప్రాజెక్ట్ అధికారి సిహెచ్ ఉషా రాణి
నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, జూన్ 04, (సీమకిరణం న్యూస్ ) :
సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ సమన్వయకర్త శ్రీమతి సిహెచ్ ఉషా రాణి మరియు ఐ టి డి ఎ పిఓ డాక్టర్ రాణి అల్లూరు మండలం లోని చైల్డ్ అశ్రమం ను సందర్శించారు.. ఈ సందర్భంగా సెలవుల్లో పిల్లలు చదువు పట్ల ఆకర్షణ మరియు పఠన ఆసక్తి ని పెంపొందించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గూగుల్ రీడ్ అలాంగ్ యాప్ ద్వారా పిల్లల్లో ఆసక్తిని పెంపొందించే విధంగా ఆశ్రమంలోని పిల్లలందరికీ ఈ యాప్ ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? ఎలా ఉపయోగించాలి? అనే విషయాలను స్వయంగా తెలియ చేసి ఈ ఆప్ ను ఉపయోగించే విధానాన్ని నేర్పించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అధికారులు శ్రీమతి సుజాత మరియు ఐటిడిఎ సిబ్బంది శాంతకుమారి మరియు శాంతి పాల్గొన్నారు..