ఆత్మకూరు ఉప ఎన్నికకు బీజేపీ నామినేషన్
ఆత్మకూరు ఉప ఎన్నికకు బీజేపీ నామినేషన్
నెల్లూరు, ఆత్మకూరు, జూన్ 04 (సీమకిరణం న్యూస్) :
ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు బిజెపి పార్టీ నుండి జి. భరత్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
నెల్లూరు జిల్లా కావలి కి చెందిన భరత్ కుమార్ బిజెపి పార్టీలో సీనియర్ నేత. బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తో కలిసి నేడు ఆత్మకూరు లో ఉప ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన భరత్ కుమార్. ఆత్మకూరు పట్టణంలో బిజెపి పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు.. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో వారసత్వ పార్టీలకు చమరగీతం పాడేందుకు బిజెపి పార్టీ పనిచేస్తుందని వారసత్వ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకిస్తూ నేడు ఆత్మకూరులో తాము నామినేషన్ దాఖలు చేశామని వీర్రాజు తెలిపారు. నియోజకవర్గంలో మంత్రులను ఎమ్మెల్యేలను ప్రచారాలకు పంపకుండా మీ సంక్షేమ పథకాలతో ఆత్మకూరు నియోజకవర్గంలో మీ ఎన్నికల మెజార్టీ బలమెంతో నిరూపించుకోవాలని సోము వీర్రాజు అధికార పార్టీ కి సవాల్ విసిరారు. మండలానికి ఇద్దరు మంత్రులు గ్రామానికి ఒక ఎమ్మెల్యే చొప్పున ప్రచారాలకు పంపి ఇది తమ అభివృద్ధి ఫలం అంటే సిగ్గుచేటని కేవలం అభ్యర్థి ప్రచారంతో తమ బలం నిరూపించుకోవాలని కోరారు.. బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులను సంక్షేమ పథకాలను తమకు అనుకూలంగా మలుచుకుని తమ నవరత్నాలకు వాడుకొని సంక్షేమ అందించామని రాష్ట్ర ప్రభుత్వం చుట్టుకుంటుందని తెలిపారు.. పార్టీలో తాను ఎంతో కష్టపడి పైకి వచ్చానని ప్రజల కష్టాలు తనకు తెలుసునని భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేస్తుందని ఆ పథకాలు నేరుగా ప్రజల కు చేరేల తాను కృషి చేస్తానని తన విజయానికి సహకరించాలని ప్రజలను కోరారు.. ఈ నామినేషన్ దాఖలుకు బిజెపి పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు హాజరయ్యారు…