అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి
- బీఎస్పీ నకిరేకల్ ఇంచార్జ్ మేడి ప్రియదర్శిని
అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి
– బీఎస్పీ నకిరేకల్ ఇంచార్జ్ మేడి ప్రియదర్శిని
చిట్యాల, జూన్ 04, (సీమకిరణం న్యూస్) :
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బాలికపై అత్యాచారం జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయకపోవడం దారుణమని, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఎస్పీ నకిరేకల్ ఇంచార్జ్ మేడి ప్రియదర్శిని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించాలన్నారు.ఈ ఘటనలో ప్రజా ప్రతినిధుల, సామాన్యుల కుటుంబాలకు చెందిన ఎవరినైనా కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా మహిళల రక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్ఠంగా అమలు చేయాలని శనివారం ప్రియదర్శిని మేడి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.