ప్రియుడి కోసం ప్రియురాలు ఆందోళన
ప్రియుడి కోసం ప్రియురాలు ఆందోళన
పత్తికొండ టౌన్, జూన్ 04, (సీమకిరణం న్యూస్) :
మండలంలోని చందోలి గ్రామంలో ప్రియుడి కోసం ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు ఆందోళన చేసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బాధితురాలు విలేకరులతో మాట్లాడుతూ హోళగుంద కు చెందిన దళిత యువతి సిద్ధ లింగమ్మ, పత్తికొండ మండలం చందోలి గ్రామానికి చెందిన బోయ రవి రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఇద్దరం కలసి చదువుకోవడం జరిగిందని, ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించు కోవడం తో ఏడాది క్రితం తనను వివాహం కూడా చేసుకొని సంవత్సరం పాటు కలిసి ఉన్నామని, అయితే తనకు తెలియకుండా ప్రియుడు రవి పారిపోవడంతో, హోళగుంద పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయినా ఇంతవరకు నాకు న్యాయం జరగలేదని సిద్ధ లింగమ్మ తెలపడం జరిగింది. విషయం తెలుసుకున్న పత్తికొండ ఎస్ఐ గోపాలుడు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితురాలు తో మాట్లాడి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించడం జరిగింది.