కొండారెడ్డి బురుజుకు విద్యుత్తు కాంతులు
- రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కొండారెడ్డి బురుజుకు విద్యుత్తు కాంతులు
– రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు టౌన్, జూన్ 04, (సీమకిరణం న్యూస్) :
చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజుకు మరిన్ని అందాలు అద్దెందుకు విద్యుత్తు కాంతులు ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఎంపీ నిధులు ఒక కోటితో కొండారెడ్డి బురుజుకు ఏర్పాటు చేయనున్న విద్యుత్తు కాంతుల పనులను ప్రత్యేక పూజలతో నగర మేయర్ బి.వై. రామయ్య, కమిషనర్ ఏ.భార్గవ్ తేజతో కలిసి శనివారం రాజ్యసభ సభ్యుడు టి.జి. వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన కొండారెడ్డి బురుజును ఆధునిక హంగులతో తీర్చిదిద్దెందుకు తన వంతు పూర్తిస్థాయిలో సహరిస్తానన్నారు. కొండారెడ్డి బురుజు చుట్టూ ఫుట్ పాత్ ఏర్పాటు కొరకు ప్రక్కనున్న దుకాణాల యజమానులతో చర్చించి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.జిల్లాలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ కొండారెడ్డి బురుజు ఆకర్షణీయంగా కనబడేలా వెనుక ఉన్న ఓపేన్ థియేటర్లో నగర పాలక సంస్థ రూ.1.40 కోట్ల నిధులతో ఇప్పటికే అభివృద్ధి పనులను ప్రారంభించామని, తాజగా టి.జి. వెంకటేష్ ఎం.పి. ల్యాండ్స్ కింద మరో కోటి రూపాయలతో విద్యుత్ కాంతులను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు..అనంతరం రాజ్ విహార్ సెంటర్లో ఫౌంటేన్ ఏర్పాటుకు సహకరించాలని టి.జి. వెంకటేష్ ని మేయర్ కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మౌనిక రెడ్డి, పురావస్తు శాఖ అధికారులు పాల్గొన్నారు.