ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
స్వామికి విరాళాల వెల్లువ

స్వామికి విరాళాల వెల్లువ
బనగానపల్లె టౌన్ , జూన్ 04, (సీమకిరణం న్యూస్) :
బేతంచర్ల మండల పరిధిలోని ఆర్.ఎస్.రంగాపురం గ్రామ శివారులోని వెలసిన వైష్ణవ క్షేత్రమైన శ్రీ లక్ష్మీ మద్దిలేటి స్వామి దేవస్థానంలో శనివారం భక్తులు విరాళాలను విరివిగా సమర్పించుకున్నారు.శనివారం విరాళాల రూ.8,15,603 లు వచ్చినట్లు ఆలయ ఈవో పాండు రంగారెడ్డి తెలిపారు. మానవ పాడు మండలంలోని ఏ. బూడిద పాడు గ్రామానికి చెందిన గోపాల్,మహేశ్వరమ్మ లు శ్రీ మహాలక్ష్మీ అమ్మ వారికి 950 గ్రాముల వెండి వడ్డాణం సమర్పించుకున్నారు.విరాళాలు సమర్పించుకున్న భక్తులకు ఆలయ అధికారులు స్వామి వారి ప్రత్యేక దర్శనం,వేద పండితుల ఆశీర్వచనాలు, లడ్డు ప్రసాదం అందజేశారు.