అదనపు గదులకు రూ.1.44 కోట్లు మంజూరు
పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి
అదనపు గదులకు రూ.1.44 కోట్లు మంజూరు
పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి
క్రిష్ణగిరి, జూన్ 04, (సీమకిరణం న్యూస్) :
పోతుగల్ గ్రామంలో అదనపు గదులు నిర్మించేం దుకు రూ.1.44 కోట్లు మంజూరైనట్లు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.
శనివారం మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలో అదనపు గదుల నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాడు నేడు రెండో విడత కింద 12 గదులు నిర్మించేందుకు ఈ నిధులు మంజూరు అయింద అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పిల్లల చదువుకోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిధులు మంజూరు చేస్తూ పాఠశాలలో అభివృద్ధిపనులు చేపడుతు న్నారని అన్నారు. నాడు నేడు కింద పాఠశాలల్లో మౌలిక వసతుల కొరకు మొదటి విడతలో కోట్ల రూపాయలు హెచ్చించి పనులు చేయించారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పెట్టి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నాడుని ఆమె విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ ఘన విజయం సాధించి విజయ ఢంకా మోగిస్తోంది అని ఆమె జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి , జెడ్ పి టి సి కే ఈ సుభాషిని, సింగిల్ విండో ప్రెసిడెంట్ బ్రహ్మానంద రెడ్డి, ఎంపీడీవో అన్వర్ బేగం , ఎమ్మెల్యే శ్రీనివాసులు, పంచాయతీరాజ్ ఏఈ ,గ్రామ సర్పంచ్ తెలుగు వాణిశ్రీ , ఎంపీటీసీ రాజేశ్వరి తెలుగు వెంకటేష్ , విద్య కమిటీ చైర్మన్ వెంకటేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బా రెడ్డి, జులపాల మద్దిలేటి, , పోతుగల్ , ఎర్రబాడు, మల్లాపురం, ఆగవేలి గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.