కుందరవాగు వంతెన ఏర్పాటుకు ప్రతిపాదనలు
ఉయ్యాలవాడ, జూన్ 04, (సీమకిరణం న్యూస్) :
ఆళ్లగడ్డ – మాయలూరు ప్రధాన రహదారిలో ఇంజేడు గ్రామం సమీపంలో ఉన్న కుందర వాగుపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. ఈ ప్రదేశాన్ని ఆమె ఆర్ అండ్ బి డి ఈ సుధాకర్, తహసీల్దార్ సుభద్ర లతో కలిసి శనివారం సాయంత్రం పరిశీలించారు. వంతెన నిర్మాణం కోసం 3.01 ఎకరాలు అవసరం అవుతా యని అధికారులు నిర్ణయిం చారు. ఇందులో 2.54ఎకరాలు పట్టా భూమి కాగా, 0.47 ఎకరాలు ప్రభత్వ భూమిగా తేల్చారు. అవసరం అయిన భూసేకరణ కోసం రూ.20 లక్షలు మంజూరు చేస్తామన్నా రు.అనంతరం ఉయ్యాలవాడ కు వస్తూ దారిలో కుంట సమీపంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం విషయం ఏమైందని తహసీల్దార్ సుభద్ర ను అడిగారు. ఈ కుంట సర్వే నెంబర్ 25/1లో 5-76 ఎకరాలు విస్తీర్ణం కలిగి ఉందన్నారు. ఇందులో 1.
10ఎకరాలు అక్రమణకు గురైందన్నారు. ఇక్కడ ట్యాంక్ నిర్మాణం కోసం అయిదు సెంట్లు స్థలం ఇవ్వగా, ట్యాంక్ నిర్మాణాన్ని కొందరు అక్షేపణ చేయడం వల్ల నిర్మాణం జాప్యం జరుగుతున్నదని తహసీల్దార్ వివరణ ఇచ్చారు. ఈ విషయం పై తగిన చర్యలు చేపట్టాలని జే. సి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ఆర్ ఐ తులసి కృష్ణ, సత్తార్, వీఆర్వో లు, మండల సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.