సోషల్ మీడియా చాటింగ్ లో అమ్మాయిలు,మహిళలు జాగ్రత్త!!
జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్

సోషల్ మీడియా చాటింగ్ లో అమ్మాయిలు, మహిళలు జాగ్రత్త…..
జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్
అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయకండి.
ఫోన్ నెంబర్లు గాని, మీ వ్యక్తిగత సమాచారం గాని , మీ ఫోటోలు గాని షేర్ చేయకండి.
మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకండి.
కర్నూలు క్రైమ్, జూన్ 06, (సీమకిరణం న్యూస్):
సోషల్ మీడియాలో అమ్మాయిలు, మహిళలు ముఖ్యంగా యుక్త వయస్సు లో ఉన్న అమ్మాయిలు అపరిచిత వ్యక్తులతో చాట్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ సోమవారం సైబర్ అలర్ట్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియా ప్రొఫైల్లో వారు పెట్టిన విధంగా అవతలి వారు నిజ జీవితంలో ఉండకపోవచ్చన్నారు. ఫోన్ నెంబర్లు గాని , మీ వ్యక్తిగత సమాచారం గాని, మీ ఫోటోలు గాని, మీ ఇతర సమాచారం గానీ వారికి షేర్ చేయకకూడదన్నారు. మహిళలు / విద్యార్థినులు మీరు ఎవరితోనైనా వీడియో చాట్ చేస్తున్న సమయంలో మితిమీరి ప్రవర్తిస్తే వారు మీకు ఎంత నమ్మకస్తులయినా కూడా స్ర్కీన్ రికార్డు చేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. మహిళలు మీకు ఎంతపరిచయస్తులైనా / దగ్గరి వారు అయినప్పటికి వారితో ప్రవేట్ ఫోటోలు లేదా విడియోలు షేర్ చేయకూడదన్నారు. ఈ విధమైన సమస్యలు ఏవరికైనా ఎదురైనా, తలెత్తినా అథైర్య పడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి మీ యొక్క పరిధిలో ఉన్న పోలీసుస్టేషన్లలో గాని, సిఐ, డిఎస్పీల వద్ద గాని లేదా జిల్లా ఎస్పీ గారి కి ఫిర్యాదు చేయగలరన్నారు. మీ భద్రత పై పోలీసులకు ఎంత భాద్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉందన్నారు. జాగ్రత్త వహించాలన్నారు.