భారీ వర్షానికి గల్లంతైన కారు…
– సురక్షితంగా బయటపడ్డ కర్ణాటక వాసి
చిప్పగిరి, జూన్ 06, (సీమకిరణం న్యూస్) :
ఆదివారం రాత్రి కురి సిన భారీ వర్షానికి కారు గల్లం తు కావడంతో అందులో ప్రయాణిస్తున్న కర్ణాటక వాసి డాక్టర్ జావిద్ఆన్సర్ సురక్షితంగా బయటపడిన సంఘటన ఆలూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గత రాత్రి సమయంలో ఆలూరు నియోజకవర్గం నందు భారీ వర్షానికి ఆలూరు చిప్పగిరి మార్గమధ్యంలోనే హత్తిబెళగల్ బస్టాండ్ సమీపంలో ఉదృతంగా ప్రవహిస్తున్న కల్లి వంక వాగు నందు కర్ణాటకకు చెందిన కారు వంక దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వంక ఉధృత ప్రవాహానికి కారు ఒక్కసారిగా నీటిలో తేలియాడుతూ కొట్టుకోవడం జరిగిందని, కారును అందులో ప్రయాణిస్తున్న వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తక్షణమే అక్కడ ఉన్నా ప్రత్యేక సాక్షులు ఆలూరు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్సై రామానుజులు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని కారుని వెతికినప్పటికీ అప్పటికే ముందుకు కొట్టుకుపోయిన కారు కనిపించకుండా పోవడంతో రాత్రికి రాత్రి ఫైర్ సిబ్బంది , ఎస్ డి ఆర్ ఎఫ్ ఫోర్స్ పిలిపించుకున్న అప్పటికీ ప్రయోజనం లేకపోయిందని సోమవారం ఉదయం సంఘటన స్థలానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో హత్తిబెళగల్ గ్రామస్తులు గుర్తించినట్లు తెలుసుకున్న పోలీసులు గ్రామస్తుల సహకారంతో వంకలో కొట్టుకుపోయిన కారును, డాక్టర్ జావిద్ఆన్సర్ ను ఒడ్డుకు చేర్చారు. మృత్యుంజయుడు గా బయటపడిన డాక్టర్ జావిద్ ఆన్సరీ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా దగ్గర నల్వారి గ్రామానికి చెందిన వ్యక్తిని ఆదివారం బెంగళూరు నుండి ఆలూరు మీదుగా గుల్బర్గా కు వెళుతూ కల్లి వంక ప్రమాదంలో చిక్కుకున్నానని నా కోసము గ్రామస్తులు పోలీసులు అహర్నిశలు ప్రయత్నించి ప్రాణాలను కాపాడినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.