రహదారి నిర్మాణానికి భూమి పూజ
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

రహదారి నిర్మాణానికి భూమి పూజ
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
పత్తికొండ టౌన్, జూన్ 07, (సీమకిరణం న్యూస్):
మండలంలోని హోసూరు- మొలగవల్లి వెళ్లే మార్గం గుండా రహదారి నిర్మాణానికి పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా హోసూరు నుండి మొలగవల్లి వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని, తమ హయాంలో 7.5 కోట్ల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఓట్ల కోసం శిలాఫలకాలు ఆవిష్కరించి చేతులు దులుపుకున్నారని ఆమె విమర్శించారు. పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, తమ ప్రభుత్వ హయాంలో తాము చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్చుకోలేక తెదేపా నాయకులు అనవసరమైన ఆరోపణలు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కులాలకు, మతాలకు, పార్టీలకతీతంగా అందించిన ఘనత తమకే దక్కిందని, ఇంకా సంక్షేమ పథకాలు అందని వారికి ప్రజల నుండి తెలుసుకునేందుకు గడపగడపకు మన ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హోసూర్ గ్రామ సర్పంచ్ నాగప్ప, ఎంపీపీ నారాయణదాసు, జడ్పిటిసి ఉరుకుందమ్మ, జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, వైస్ ఎంపీపీ బలరాముడు, కో ఆప్షన్ సభ్యులు నజీర్, వైసిపి నాయకులు మోహన కృష్ణ, బన గాని శ్రీనివాసులు, శాంతి రెడ్డి, మాజీ సర్పంచులు చంద్రశేఖర రెడ్డి, వీర బద్రి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.