జాతీయ హెల్ప్ లైన్ 14566 నంబర్ ను సద్వినియోగం చేసుకోవాలి
సీనియర్ న్యాయవాది వై. జయరాజు
ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధానికి జాతీయ హెల్ప్ లైన్ 14566 పోస్టర్ ను విడుదల చేసిన సీనియర్ న్యాయవాది వై. జయరాజు
కర్నూలు లీగల్, జూన్ 06, (సీమకిరణం న్యూస్):
ఎస్సీ /ఎస్టీ పై జరిగే అత్యాచారం నిరోధక జాతీయ హెల్ప్లైన్ 14566 సద్వినియోగం చేసుకోవాలని
సీనియర్ న్యాయవాది వై.జయ రాజు
పిలుపునిచ్చారు. శనివారం ఆఫీస్ నందు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్ / ఎస్ టీ సభ్యులు రూపొందించిన జాతీయ హెల్ప్లైన్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. చట్టాల పై గ్రామ ప్రాంత గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అందరికీ అవగాహన కలిగి ఉండాలని సమస్యలు లేకుండా శాంతియుతంగా జీవించాలని. ప్రజలందరూ ఐక్యమత్యంతో ఉండాలని ప్రజలకు అందుబాటులో పోలీస్ వ్యవస్థ ఉంది అన్నారు. అందరూ సమానంగా ఐక్యమత్యంగా కుల రహిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్ 14566 హిందీ ,ఇంగ్లీష్ మరియు వివిధ ప్రాంతీయ భాషల్లో 24 గంటలు అందుబాటులో ఉండి వివక్షతను నిర్మూలించడానికి ఉపయోగపడుతుందని .బాధితులు ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్ / ఎస్ టీ సభ్యులు పీ టీ సాయి ప్రదీప్ , సత్తి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.