పది ఫలితాలలో 58.20 శాతం ఉత్తీర్ణత

పది ఫలితాలలో 58.20 శాతం ఉత్తీర్ణత
కొనసాగిన బాలికల హావా
కర్నూలు విద్య, జూన్ 06, (సీమకిరణం న్యూస్) :
పదవ తరగతి పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. కరోనా వచ్చాక రెండేళ్ల తర్వాత పదవతరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 2021 -22 విద్యాసంవత్సరంలో జిల్లాలో మొత్తం 51,669 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా30,069 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలుర 27,302 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా15,010,మంది, బాలికలు 24,367 మంది పరీక్షలకు హాజరు కాగా15,059 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 54.98 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 61.80% సాధించి మరోమారు జిల్లాలో పైచేయిగా నిలిచారు.రాష్ట్రస్థాయిలో 58.20 శాతం ఉత్తీర్ణతతో కర్నూలు జిల్లా 11వ స్థానంలో నిలిచింది.
కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత జరిగిన 10వ తరగతి పరీక్ష ఫలితాలు జిల్లాలో నిరాశపరిచాయని జిల్లా విద్యాశాఖ అధికారి డా. రంగారెడ్డి తెలిపారు. ఈ విద్యాసంవత్సరం ఆరంభంలో కరోనా కారణంగా తరగతులు సక్రమంగా జరగడం జరగ లేదని, విద్యార్థులు కూడా ప్రిపరేషన్లో అలసత్వం వహించడం వల్ల ఉత్తీర్ణతా శాతం తగ్గేందుకు ఒక కారణం అన్నారు. తొందర్లోనే జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రధానోపాధ్యా యులతో ఫలితాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో గుర్తించిన లోటుపాట్లను గుణపాటంగా తీసుకొని వచ్చే ఏడాది ఆరంభం నుంచే ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తామన్నారు. ఆగస్టు నుంచి ప్రతి పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తా మన్నారు. డిసెంబర్ నుంచి రోజువారీగా పదవ తరగతి విద్యార్థులకు టెస్ట్ లు నిర్వహిస్తామన్నారు. వీటిపై ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యా యులతో ప్రతి నెల సమీక్ష చేస్తామన్నారు.