ANDHRABREAKING NEWSCRIMEPOLITICS
వెదురు వేలం పాటలో రూ.14.47 లక్షల ఆదాయం
వెదురు వేలం పాటలో రూ.14.47 లక్షల ఆదాయం
రుద్రవరం, జూన్ 07, (సీమకిరణం న్యూస్) :
మండల కేంద్రంలోని అటవీ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన వెదురు వేలం పాటల్లో ప్రభుత్వానికి 14.47 లక్షల ఆదాయం చేకూరిందని డి ఎఫ్ ఓ వినీత్ కుమార్ తెలిపారు. ఈ సంద ర్భంగా ఆయన తెలిపిన వివరా ల మేరకు మొదటి రకానికి చెందిన 6 వేల వెదుర్లు, రెండవ రకానికి చెందిన 18 వేల వెదుర్లు, మూడవ రకానికి చెందిన 27 వేల వెదుర్లు మొత్తం 51 వేల వెదుర్లకు వేలం నిర్వహించగా ప్రభుత్వానికి 14, 47,500 ల ఆదాయం చేకూరిందని తెలిపారు. ఈ వేలం పాట ల్లో ఫారెస్ట్ రేంజ్ అధికారులు మాధవి, శ్రీపతి నాయుడు, డిప్యూటీ రేంజ్ అధికారి నాగేంద్ర నాయక్, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు నాగరాజు ,పెద్దన్న కాంట్రాక్టర్లు, మేస్త్రీలు ఇమ్మానుయేలు, నరసింహులు పాల్గొన్నారు.