విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం
జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం
జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్
కర్నూలు క్రైమ్, జూన్ 06, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు నగరంలోని కొత్తపేట దగ్గర ఉన్న స్పందన కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.
ఈ స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం ఇప్పటివరకు 93 ఫిర్యాదులు వచ్చాయి. స్పందనకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ….
1) అంగన్వాడి పోస్ట్ ఖాళీగా ఉందని ఆ ఉద్యోగం నా భార్యకు ఇప్పిస్తామని చెప్పి ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని మోసం చేశాడని దేవనకొండ మండలం, గుండ్ల కొండ గ్రామానికి చెందిన బీరప్ప రాజు ఫిర్యాదు చేశారు.
2) రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశారని ఆస్పరి మండలం, ముత్తుకూరు గ్రామానికి చెందిన రమేష్ ఫిర్యాదు చేశారు.
3) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నకిలీ ఆర్డర్ కాపీ ఇచ్చి డబ్బులు తీసుకొని మోసం చేశారని కర్నూల్, కృష్ణ నగర్ కు చెందిన ఉదయ్ కిరణ్ ఫిర్యాదు చేశారు.
4) నా భర్త రెండో పెళ్లి చేసుకుని నన్ను మోసం చేశాడని కర్నూల్, బాలాజీ నగర్ కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు.
5) కుమారుడు ఆస్తులు తీసుకొని అన్నం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నాడని కౌతాళం మండలం కు చెందిన నాగేశ్వర రావు ఫిర్యాదు చేశారు.
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ స్పందన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, డిఎస్పీ యుగంధర్ బాబు పాల్గొన్నారు.