పట్టుబడిన మద్యం ధ్వంసం
పట్టుబడిన మద్యం ధ్వంసం
ఆదోని క్రైమ్, జూన్ 09, ,(సీమకిరణం న్యూస్) :
ఆదోని సబ్ డివిజన్ పరిధిలోనీ 8 పోలీస్స్టేషన్ పరిధిలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ధ్వంసం చేసినట్లు డి.ఎస్.పి. వినోద్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక సిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద అక్రమ మద్యాన్ని ట్రాక్టర్లతో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఆదోని ఒకటవ, రెండవ, మూడవ, తాలూకా, కోసిగి, పెద్ద తుంబలం కౌతాళం, పెద్దకడబూరు, ఇస్వీ పోలీస్ స్టేషన్ ల పరిధిలో 147 కేసుల్లో 5,140 లీటర్ల కర్ణాటక మద్యం, 60 కేసులలో 570 మీటర్ల నాటు సారాను ట్రాక్టర్లతో రెవెన్యూ అధికారుల సమక్షం లో ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. యువత రాత్రివేళల్లో అనవస రంగా రోడ్లపై తిరగకుండా తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు విక్రమసింహ, మహేశ్వర్ రెడ్డి, ఎస్ ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.