రానున్నది గాలి కాలం విద్యుత్ సమస్య లేకుండా చూడండి
అవుకు మండలాధ్యక్షులు చల్లా రాజశేఖర్ రెడ్డి
అవుకు, జూన్ 09, (సీమకిరణం న్యూస్) :
ఏ చిన్నపాటి గాలివాన వచ్చినా విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని అవుకు మండలాధ్యక్షులు చల్లా రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మండల అభివృద్ధి అధికారి అజాంఖాన్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలివాన వచ్చినప్పుడల్లా విద్యుత్ స్తంభాలు నేలకొరిగి మండలంలో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని దీనికి పరిష్కార మార్గం లేదా అని విద్యుత్ ఏ ఈ పకీరయ్య ను ప్రశ్నించడంతో ఏ ఈ సమాధానం చెబుతూ మండలంలో 54 కిలోమీటర్ల మేర విద్యుత్ స్తంభాలు ఉన్నాయని కొన్ని చోట్ల పొలాలు గట్టిగా లేకపోవడం వలన గాలులకు స్తంభాల పడిపోతున్న మాట వాస్తవమేనని ఇకపై స్తంభాల పడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని సభకు వెల్లడించారు. ఉప్పలపాడు పిహెచ్సి డాక్టర్ వినోద్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం అయిందని ప్రజలు తాగు నీటిని కాచి ,చల్లార్చి ,తాగాలి అప్పుడే వ్యాధులు దరిచేరవని అన్నారు. మహారాష్ట్ర, కేరళ లో కరొన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తప్పనిసరిగా మాస్కు ధరించాలి అన్నారు. వ్యవసాయ అధికారి శ్రీ కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయిందని వరి, మొక్కజొన్న, పత్తి, మిరప వంటి పంటలు సాగు చేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రైతు భరోసా కేంద్రంలో జీలుగా, పిల్లిపెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని తమ పొలాల్లో వేసుకోవడం వలన పొలంలో లావు పెరిగి మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు. అనంతరం ఇతర శాఖల అధికారులు తమ శాఖ పరిధిలోని అభివృద్ధిని సభకు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు, ఉప మండల అధ్యక్షులు తెలుగు రామప్ప, విద్యాధికారి శ్రీధరరావు, పశువైద్యాధికారి,డాక్టర్ భారతి దేవి, ఏఈలు కరిముల్లా, మహమ్మద్ గౌస్, పకీరయ్య, మునిస్వామి, బనగానపల్లి ఆర్టీసీ సి డిపో డిప్యూటీ మేనేజర్ పకీరయ్య, ఐకేపీ ఏపీఎం జ్యోతి, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఏపీ ఎమ్ హనీఫా, ఎంపీటీసీలు,సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.