కామాక్షితాయిని దర్శించుకున్న విశ్రాంత న్యాయమూర్తి
బుచ్చిరెడ్డిపాలెం, జూన్ 09, (సీమకిరణం న్యూస్) :
బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలసివున్న శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షితాయి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి ఎం వెంకటరమణ సతీసమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తొలుత దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు ఆలయ అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి, శ్రీ మల్లికార్జున స్వామి వారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, పార్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు శేష వస్త్రంతో వారిని సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట నెల్లూరు జిల్లా న్యాయస్థానం ప్రోటోకాల్ జడ్జి సాయిరాం తదితరులు ఉన్నారు.