యువకుల కుటుంబాలకు ఎమ్మెల్యే చేయూత
దాతృత్వాని చాటుకుంటున్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి
నేను ఉన్నాను అంటూ కుటుంబాలకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే ప్రసన్న
బుచ్చిరెడ్డిపాలెం, జూన్ 09, (సీమకిరణం న్యూస్) :
బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామం పెన్నా నదిలో ఇటీవల కాగులపాడు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే పెన్నా నదిలో గల్లంతైన విద్యార్థులు మున్నా,రాకేష్ లు విగత జీవులుగా మారారు. దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.కుటుంబ సభ్యుల దుఖాన్ని చూసి ఆయన చలించిపోయారు. ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇరువురు కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించి నేనున్నానంటూ అండగా నిలిచారు. నియోజకవర్గ ప్రజలు ఎటువంటి పరిస్థితిలో ఉన్న వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. యుక్తవయసులోనే యువకులు తమ ప్రాణాలు పోగొట్టుకోవడం తనకెంతో బాధ కలిగించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో వవ్వేరు కో అపరేటివ్ బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి,జొన్నవాడ కామాక్షితాయి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు,మండల అధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.