
విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దు – మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి
బుచ్చిరెడ్డిపాలెం, జూన్ 09, (సీమకిరణం న్యూస్) :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నాయి అని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.బుచ్చిరెడ్డిపాలెం వవ్వేరు గ్రామంలోని 19వార్డులో ఆయన బాదుడే బాదుడు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుబేరు తెలుగుదేశం పార్టీకి పురిటిగడ్డ లాంటిదన్నారు.అటువంటి గడ్డలో రౌడీయిజాన్ని తీసుకువచ్చి ప్రజలను మభ్య పెట్టి, భయపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచక పరిపాలన చేస్తూ డీజిల్,పెట్రోల్,నిత్యవసర సరుకులు ధరలు అధికంగా పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారు అని అన్నారు. నేను ఉన్నాను,నేను విన్నాను, మాట తప్పను, మడిమ తిప్పను అని చెప్పిన మాటలను పూర్తిగా తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు.అంతేకాక ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలు దారుణంగా ఉన్నాయి అన్నారు. ఫలితాలలో మెరుగైన విద్యార్థులు ఫెయిల్ అవడంతో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. విద్యార్థులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు అన్నారు. ప్రతి ఒక్కరూ మరలా రీ వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు.రాష్ట్రం మరోసారి సుభిక్షంగా ఉండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శేషయ్య, బత్తల హరికృష్ణ, స్థానిక నాయకులు శివయ్య నాయుడు, శేకరయ్య, మైనార్టీ నాయకుడు సుల్తాన్ అహ్మద్ భాషా తదితరులు పాల్గొన్నారు.