వెల్దుర్తి విద్యుత్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
వెల్దుర్తి, జూన్ 08, (సీమకిరణం న్యూస్):
వెల్దుర్తి లోని విద్యుత్ కార్యాలయం పై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అవినీతికి పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14400కు ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు చేసినట్లు డీఎస్పీ శివ నారాయణస్వామి తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది లైన్ మార్చడానికి, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి లంచం ఇస్తే తప్ప పనులు చేయమని మండలానికి చెందిన కొందరు స్పందనకు ఫిర్యాదు చేసినట్లు ఆయన అన్నారు. అందుకుగాను బుధవారం సాయంత్రం నాలుగుగంటలకు ఈ కార్యాలయం పై ఆకస్మిక తనిఖీ చేసినట్లు చెప్పారు. ఈ సోదాల్లో ఏఈ పుల్లయ్య మరికొందరి సిబ్బంది వద్ద రూ. 39,740 లెక్క చెప్పని నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నగదు పై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని తప్పని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈయన వెంట సిఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, ఎస్ఐ భాష మరికొందరు పాల్గొన్నారు.