సీనియర్ జర్నలిస్ట్ చంద్రశేఖర్ సేవలు వరువలేనివి..
నేటి జర్నలిస్టులకు ఆయన ఆదర్శం..
ఎపి డబ్యూజే ఎఫ్ ఆధ్వర్యంలో చంద్రశేఖర్ కు ఘన నివాళ్లు అర్పించిన జర్నలుస్టులు..
నంద్యాల కలెక్టరేట్, జూన్ 07, (సీమకిరణం న్యూస్):
పత్రికా రంగంలో సీనియర్ జర్నలిస్టు చంద్రశేఖర్ చేసిన సేవలు మరువలేనివని నేటి జర్నలిస్ట్ లోకానికి ఆయన ఆదర్శప్రాయమని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జనార్దన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలుస్ట్స్ ఫెడరేషన్ (ఎపి డబ్ల్యూజే ఎఫ్) ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు మాదాల శ్రీనివాసులు అన్నారు. మంగళవారం సాయిబాబా నగర్ వద్ద ఉన్న భగత్ సింగ్ గ్రంధాలయం లో ఏపిడబ్ల్యూజే ఎఫ్ నంద్యాల నియోజకవర్గం అధ్యక్షులు శివ అధ్యక్షతన సీనియర్ జర్నలిస్ట్ పంచాంగ్నుల చంద్రశేఖర్ సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్బంగాసీనియర్ జర్నలిస్ట్ జనార్దన్ రెడ్డి, ఎపి డబ్ల్యూజే ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మాదాల శ్రీనివాసులు,సీనియర్ జర్నలిస్ట్ నాగ ప్రసాద్ ఎపిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ డి. మౌలాలి, ఆంధ్రప్రభ ఏ జి ఎం బ్యూరో ఇంచార్జి నాగేంద్ర, ఎపి డబ్ల్యూజే ఎఫ్ నంద్యాల నియోజకవర్గం కార్యదర్శి ఏ. జగన్ మోహన్,ఉపాధ్యకులు జాషువా, జర్నలిస్టులు కిరణ్, సుబ్బారాయుడు, సీపీఐ పట్టణ కార్యదర్శి బాబాపకృద్దీన్,తదితరులు చంద్రశేఖర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివ్వాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా జనార్దన్ రెడ్డి మాదాల శ్రీనివాసులు, సీపీఐ కార్యదర్శి బాబా పకృద్దీన్ లు మాట్లాడుతూ చంద్రశేఖర్ విద్యార్ధి ఉద్యమంలో పనిచేస్తూ పత్రికా రంగంలో అడుగుపెట్టారన్నారు. విశాలాంధ్రలో తనపయనం ప్రారంభించిన, ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ వంటి ప్రముఖ పత్రికల్లో పని చేశారన్నారు. ఆయన వామపక్ష భావజాలంతో ఉంటూ ప్రజా సమస్యను ఎత్తిచూపుతూ ప్రజా చైతన్య దిపికగా ఆయన వార్త కథానాలు ఉండేవని పత్రిక రంగంలో చంద్రశేఖర్ చేసిన సేవలను కొనియాడారు. నిబద్దతకు, నీతి నిజాయితీకి మారు పేరుగా చంద్రశేఖర్ నిలిచారాని వారు పేర్కొన్నారు. చంద్రశేఖర్ అనారోగ్యం తో మృతి చెందారని, ఆయన మన మధ్య లేరని ఉహించుకోవడమే బాధగా ఉందన్నారు.ఆయన నేటి జర్నలిస్ట్ లోకానికి ఆదర్శ ప్రాయుడని ఆయన స్ఫూర్తిని జర్నలిజంలో నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని వారు అన్నారు. కార్యక్రమం లో సీపీఐ నాయకులు సామన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఎపిడబ్ల్యూజే ఎఫ్ నాయకులు రాజు, మధు అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు.