ప్రజల వద్దకే ప్రభుత్వం : ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి
ఎమ్మిగనూరు టౌన్, జూన్ 08, (సీమకిరణం న్యూస్) :
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలోని 28వ వార్డు వెంకటాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎర్రకోట జగనన్న వార్డులోని ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎర్రకోట జగనన్న వెంకటాపురం ప్రజలతో మాట్లాడుతూ సిఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడప గడప ఎలా చేరాయి ప్రతి ఒక్కరి అవ్వ తాత, అక్క చెలమ్మలను ఆడిగి తెలుసుకున్నారు. నవరత్నాలుతో అన్ని వర్గాలకు న్యాయం చేయడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేపట్టిన నాటి నుండి రైతాంగం సుభిక్షంగా ఉన్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు నేరుగా ఇంటికే అన్ని రకాల ఎరువులను అందిస్తున్నారు. అదే విధంగా వై.యస్.ఆర్. రైతు యంత్రసేవ ద్వారా సబ్బిడి యంత్ర పరికారాలు ఇచ్చి ఆదుకుంటున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుంది అని తెలిపారు. అలాగే వార్డులో ఉన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాను అని ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి నెలా ఒకటో తారీఖునే ఠంచనుగా ఉదయమే రూ. 2500 చొప్పున పెన్షన్ ఇచ్చి, మనవడిలా సీఎం వైఎస్ జగన్ ఆదుకుంటున్నారని వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు. సొంత అన్నలా, తమ్ముడిలా సీఎం వైఎస్ జగన్ అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇస్తుండటం వల్ల పిల్లలను బాగా చదివించుకో గలుగుతున్నామని అక్కచెల్లెమ్మలు ఎర్రకోట జగనన్న కు వివరించారు. అలాగే ఒకే గడపకు రూ. 9.54 లక్షల రూపాయల లబ్ధి పోందిన వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి గారికి మరియు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియాజేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బజారి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెయస్. రఘు, సునీల్ కుమార్, కమీషనర్ ఎం. క్రిష్ణా, డిఈఈ వెంకటేశ్వర్లు, మనోహర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, కో ఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ ఆహ్మద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.