ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ప్రారంభం : యుటిఎఫ్
గోనెగండ్ల , జూన్ 09 , ( సీమకిరణం న్యూస్ ) :
మండలంలోని విద్యార్థిని విద్యార్థులు తమలో ఉన్నటువంటి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఉపయోగ పడుతాయని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యల్లప్ప,జయరాజ్ అన్నారు. గురువారం స్థానిక మండల కేంద్రంలో యుటిఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామన్,చంద్రపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులను ప్రారంభించిన అనంతరం యుటిఎఫ్ జిల్లా నాయకులు హేమంత్,నవీన్,దేవపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులను అందరూ సద్వినియోగం చేసుకొని భవిష్యత్ ఇంగ్లీష్ అంటే భయం లేకుండా ముందుకు సాగాలని సూచించారు.ఉన్నత చదువుల కోసం ఇంగ్లీష్ చాలా ఉపయోగపడుతుంది.గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లల్లో ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంచడానికి,ఇంగ్లీష్ అంటే భయం లేకుండా చేయడానికి, పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరచడానికి ఇటువంటి క్లాసులు ఉపయోగ పడుతాయి కనుక అందరూ క్లాసులకు క్రమం తప్పకుండ హాజరై విజయవంతం చేయడానికి సహకరించాలని చెప్పారు.మొదటి రోజు 70మంది పైగా వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు హాజరైయ్యారు.
ఈ కార్యక్రమం యుటిఎఫ్ నాయకులు రామ్మోహన్,నాగేశ్వరావు, బాబు,జిక్రియ,లింగన్న, రాజశేఖర్,వీరన్న,నంది మొదలగువారు పాల్గొన్నారు