సివిల్ కేసులు పోలీసులు పరిష్కరించరు – సర్కిల్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు
బుచ్చిరెడ్డిపాలెం, జూన్10, (సీమకిరణం న్యూస్) :
బుచ్చిరెడ్డిపాలెం నగర పట్టణంలోని స్థానిక సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు కార్యాలయాలలో భూ సమస్యల పరిష్కారాలను చేయమని భూ సమస్యలు పరిష్కారాలు కేవలం తాసిల్దార్ కార్యాలయంలో మాత్రమే పరిష్కారమవుతాయని ఆయన తెలిపారు. ఒకవేళ అ కోర్టులో పరిష్కారం పెండింగ్లో ఉన్న సమయంలో ఒకరినొకరు ఇబ్బందులు పెట్టుకుంటున్నారని తమ దృష్టికి వస్తే మాత్రమే అప్పుడు వారిపై కేసులు నమోదు చేస్తారని ఆయన తెలిపారు. లా అండ్ ఆర్డర్ ని బ్రేక్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. అంతేకాక భూ కబ్జాదారులు ఎవరైనా ఇతరుల భూములను ఆక్రమిస్తే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని తెలిపారు. పేదల దగ్గర అమాయకుల దగ్గర మోసం చేసి డాక్యుమెంట్స్ రాయించుకునే వారిపై చీటింగ్ కేసు నమోదు చేస్తామన్నారు. ఎవరి పొలం అయినా వేరే వారి ఆధీనంలో ఉంది అని తెలిస్తే వారు సివిల్స్ కోర్టుకు వెళ్లి అక్కడ దానిని పరిష్కరించుకోవాలి అన్నారు దీనిపై పోలీసులకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదని తెలిపారు. గిరిజనుల భూములను కొనుక్కోవడం నేరమని అని తెలిపారు. కొనుక్కున్న అది తిరిగి వారికి హ్యాండోవర్ చేయాలని అన్నారు. సివిల్స్ మ్యాటర్ లో పోలీసులు ఎంతమాత్రం నివాళులు కార్ అని ఏదైనా తగాదాలు జరిగినా కొట్లాటలు జరిగినప్పుడు మాత్రమే పోలీసులు దీనిలో ఇన్వాల్వ్ అవుతారని ఆయన పేర్కొన్నారు. భూ సమస్యలు ఎటువంటి అయినా సరే వాటిని కోర్టు ద్వారానే పరిష్కారం చేసుకోవాలని ఎవరి మాటలు విని అపోహ పడవద్దని ఆయన సూచించారు.