పొణకా కనకమ్మకు నివాళి
బుచ్చిరెడ్డిపాలెం, జూన్10, (సీమకిరణం న్యూస్) :
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని శ్రీ గోపాలకృష్ణయ్య పాఠశాలలో పొణకా కనకమ్మ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగింది.సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో పొణకా కనకమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్రాంతి ఉపాధ్యాయులు పణితి వెంకట రమణయ్య మాట్లాడుతూ పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమానికి 13 ఎకరాలు, నెల్లూరులో కస్తూరి దేవి పాఠశాలకు 23 ఎకరాలు దానం చేసి చరిత్రలో మార్గదర్శకురాలిగా గుర్తుండి పోయారన్నారు. మహిళలకు స్వయం ఉపాధి పథకాలు, గ్రంథాలయ ఉద్యమం నిర్వహించిన ఘనత ఆమెకే దక్కుతుందని పేర్కొన్నారు. అహింస, విదేశీ వస్తువుల బహిష్కరణ, నూలు వస్త్రాలు తయారు చేయడం, చరఖా వడకడం, మాంసాహారాన్ని నిషేధించడం వంటి ఆశయాలతో గాంధేయ మార్గంలో నడిచి చరిత్రకెక్కార ని ప్రశంసించారు. ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. “సుజనరంజని” అనే సంస్థను ఏర్పాటు చేసి అంటరానితనం, అస్పృశ్యత కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. కలరా వ్యాధి గ్రస్తులకు హరిజనవాడలో గంజి పోసి ఎంతోమందిని ఆదుకున్న మహనీయురాలుగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త గండికోట సుధీర్ కుమార్, ఉపాధ్యాయులు గుంజి నాగభూషణం,చిన్ని వెంకటప్రసాద్, జి.చెన్నయ్య, హరి, సునీత పాల్గొన్నారు.