మార్చ్ వాక్ పై సిఆర్పిఎఫ్ సిబ్బందికి అవగాహన

మార్చ్ వాక్ పై సిఆర్పిఎఫ్ సిబ్బందికి అవగాహన
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, జూన్ 10 (సీమకిరణం న్యూస్) :
ఆత్మకూరు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ఏఎస్ పేట మండలం సంగం మండలాలకు కేటాయించిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ సిబ్బందికి స్థానిక ఎస్ఐ షేక్.సుభాని సమస్యాత్మక గ్రామాల్లో నిర్వహించవలసిన మార్చి వాక్ ఎన్నికల విధులు తదితర వాటిపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం సీఆర్పీఎఫ్ సిబ్బంది బసచేసిన మోడల్ స్కూల్ నందు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలీస్ సిబ్బందితో సమస్యాత్మక గ్రామాల్లో మార్చ్ వాక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఉప ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారని ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ ఎస్.లక్ష్మయ్య ఏఎస్ పేట టీం సబ్ ఇన్స్పెక్టర్ పి.రమేష్ , సంగ0 టీం సబ్ఇన్స్పెక్టర్ వి.రాములు E/39 బెటాలియన్ సీఆర్పీఎఫ్ సిబ్బంది స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.. అనంతరం మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో , పెద్ద అబ్బీపురం గుడిపాడు, చౌటభీమవరం , గ్రామాల్లో మార్చ్ వాక్ పోలీస్ కవాతు నిర్వహించారు..