కర్నూలులో జరిగే ధర్నాను విజయవంతం చెయ్యండి
ఈ నెల13 వ తేదీన కర్నూలులో జరిగే ధర్నాను విజయవంతం చెయ్యండి : ఆర్.సి.సి
గోనెగండ్ల , జూన్ 10 , ( సీమకిరణం న్యూస్ ) :
రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటీ అనుబంధమైన రాయలసీమ కళా వేదిక నిర్వహిస్తున్న కళాకారుల పెంచల జీవోను తక్షణమే అమలు చేయాలని ఈ నెల 13 సోమవారం ఉదయం 10 గంటలకు కర్నూలు కలెక్టరేట్ దగ్గర జరుగు ధర్నాను జయప్రదం చేయాలని రాయలసీమ కళావేదిక కర్నూలు జిల్లా అధ్యక్షులు రామ్ చరణ్, మరియు ఆర్ సి సి ఈరన్న, అంజలి నాయుడు, పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళాకారుల పట్ల చూపుతున్న వివక్షను ఎత్తి చూపిస్తూ రాష్ట్రంలోని పేద కళాకారులకు జరుగుతున్న అన్యాయాల పట్ల గళమెత్తారు కళాకారుల కొరకై ప్రత్యేకంగా తెచ్చిన జీవోలను నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ కరోనా లాక్డౌన్ లో నష్టపోయిన కళాకారులను ఆదుకో కపోగా ప్రస్తుతం అన్ని ఎన్నికలలో నైపుణ్యం పొందిన కళాకారులకు రావాల్సిన పెన్షన్లు ఇంటి పట్టాలు మొదలగు వాటి విషయాల్లో తీవ్ర వివక్ష చూపిస్తున్నట్లు తెలిపారు కళాకారులకు ప్రత్యేకంగా నిలిపి వేయడం ఎంతో సిగ్గుచేటు అని అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఇ కార్యక్రమంలో భాగస్వామిగా కళాకారులు మాత్రమే నిలుస్తున్నారు అయితే వారి ప్రతిభను గుర్తించకుండా వారి కలం ప్రోత్సహించకుండా ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు కళాకారుల పెన్షన్లు మంజూరు చేయడానికి వారికి ఇంటి పట్టాలు కేటాయించడానికి వారి గుర్తింపు కార్డులు కేటాయించడానికి మాత్రం డబ్బులు లేవని నిలిపివేయడం ఏమైనా న్యాయమా అని వాపోయారు అందుకే ఈ నిరంకుశ పాలనలో పేద కళాకారులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని తెలిపారు కాబట్టి జిల్లాలో ఉన్న పేద కళాకారుల అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బెలగల్ మండలం మీడియా కన్వీనర్ అంజలి నాయుడు, వెంకటేష్, వెంకటప్ప రాజశేఖర్, పెద్దయ్య , సిద్దయ్య గుండ్రేవుల గ్రామ కమిటీ సభ్యులు మరియు ఆయా గ్రామ కమిటీ కళాకారులందరూ పాల్గొన్నారు