ANDHRABREAKING NEWS
అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు –

అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు
గ్రామ సర్పంచ్ దూదేకుల హుస్సేన్ బి గుర్రప్ప
సిరివెళ్ల , జూన్10, (సీమకిరణం న్యూస్) :
సిరివెళ్ల మండలం కోటపాడు గ్రామంలో అంటువ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ దూదేకుల హుస్సేన్ బి గుర్రప్ప అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట పాడు గ్రామంలో ప్రతి వీధుల్లో మురుగు కాలువలను శుభ్రం చేసి నీరు నిలుచ కుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాలలో గ్రామ వైఎస్ఆర్ నాయకులు వంక దార సుబ్బ సత్యనారాయణ పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్ నాయకులు, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.