మండలంలోని ఇల్లూరు కొత్తపేట గ్రామం సమీపంలో వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య వాహనం ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి చెట్టును ఢీకొనడంతో వాహనంలో ఉన్న పైలెట్ రామంజి కి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బైక్ పైన ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.