ఏఎస్ పేట దర్గాలో తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు
నేల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, జూన్ 11 (సీమకిరణం న్యూస్) :
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఏఎస్ పేట లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్, అమ్మ జాన్ స్వాములవారి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏఎస్ పేట మండల ఇన్చార్జిగా నియమించబడిన ద్వారకానాథ్ రెడ్డి శనివారం ఏఎస్ పేట కు విచ్చేశారు. ఈ క్రమంలో ఆయన ముందుగా స్థానికంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. స్వామి అమ్మవారి సమాధులపై ప్రత్యేక గలేఫాలను పూల చద్దర్లను పరిచారు. అనంతరం స్వామి, అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దర్గా ప్రధాన ద్వారం వద్ద స్థానిక వైకాపా నాయకులు ద్వారకనాథ్ రెడ్డి కు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఏఎస్ పేట మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, ఏఎస్ పేట సర్పంచ్ భర్త షేక్ జిలాని భాష,మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సంధాని భాష, అనుమసముద్రం ఉప సర్పంచ్ షేక్ షేరాజ్, వైసిపి నాయకులు షేక్ ఖాదర్ భాష ,మహమ్మద్ షకీల్, పటాన్ ఖాదర్ , పఠాన్ నాయబ్, ఇందూరురాజారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , సయ్యద్ షకీల్ , ఏఎస్ పేట ఉపసర్పంచ్ షేక్ రహంతుల్లా, షేక్ జావుల్ ,మండల యూత్ ప్రెసిడెంట్ షేక్ షౌకత్ ఆలీ,తదితరులు పాల్గొన్నారు.