
భారీ మెజార్టీ దిశగా పనిచేయండి : మంత్రి జోగి రమేష్
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, జూన్ 11 (సీమకిరణం న్యూస్) :
ఈనెల 23న ఆత్మకూరు నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ దిశగా వైకాపా నాయకులు కార్యకర్తలు పట్టుదలతో కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు ఉప ఎన్నికల నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్ పేట మండల ఇన్చార్జిగా నియమించబడ్డ మంత్రి శనివారం స్థానిక కామాక్షి కల్యాణ మండపంలో మండలంలోనీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ గౌతంరెడ్డి హఠాత్ మరణం తో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి కి భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ పట్టుదలతో కృషి చేయాలన్నారు ఏఎస్ పేట మండలంలో భారీ మెజార్టీ చూపినట్లయితే ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించి మండలానికి మరిన్ని అభివృద్ధి పథకాలు మంజూరు చేపిస్తామన్నారు :: అనంతరం తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎక్కడ వ్యతిరేకత లేదని ప్రతిపక్షాలు ఏదో ఒక పని పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్న చంద్రబాబు కు ప్రజల ముందు తిరిగే హక్కు లేదన్నారు నామమాత్రంగా పోటీల్లో లేమని చెప్పి లోపలి నుండి ఇతర పార్టీలకు మద్దతు తెలుపుతారని చంద్రబాబుని ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు వైసిపి నాయకులు కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరించి భారీ మెజార్టీ దిశగా పనిచేయాలన్నారు అంతకుముందు వారు దిగంత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సమావేశం అనంతరం ప్రతి గ్రామానికి చెందిన నాయకులతో వేరువేరుగా స్థానిక పరిస్థితులపై పై వివరాలు సేకరించారు ఈ కార్యక్రమంలో మండల వైకాపా కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు బోయిళ్ల పద్మజా రెడ్డి, రాజవోలు సొసైటీ చైర్మన్ కాటంరెడ్డి నరసింహారెడ్డి, స్థానిక సర్పంచ్ భర్త మైనారిటీ నాయకుడు షేక్ జిలాని భాష, మండల కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ సంధానిభాష, మాజీ ఎంపీటీసీ షేక్ షబ్బీర్ భాష, నాయకులు అన్నవరపు కోటిరెడ్డి, కాటూరి జనార్దన్ రెడ్డి, రమేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మాల్యాద్రి నాయుడు, మాజీ మండల కో ఆప్షన్ నెంబర్ షేక్ రియాజ్ అహ్మద్, సూరా శ్రీనివాసులురెడ్డి, బోడ భాస్కర్ రెడ్డి, పఠాన్ ఖాదర్, షేక్ జాకీర్ అహ్మద్, మండల యూత్ ప్రెసిడెంట్ షేక్ షౌకత్ ఆలీ,మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.