ఐ.ఎం.ఏ భవన నిర్మాణానికి రూ.50 లక్షలు విరాళం ప్రకటించిన టీజీవీ సంస్థలు
కర్నూలు టౌన్, జూన్ 11, (సీమకిరణం న్యూస్) :
కర్నూలులో ఇండియన్ మెడికల్ అసోషియన్ నూతన భవన నిర్మాణానికి టీజీవీ సంస్థల నుంచి రూ.50 లక్షలు విరాళం అందజేస్తున్నట్లు ఆ సంస్థల జూనియర్ చైర్మన్ టీజీ భరత్ తెలిపారు. నగరంలోని మౌర్య ఇన్‌లో ఐఎంఎ కమిటీ సభ్యులకు రూ.26 లక్షల చెక్కును భరత్ అందజేశారు. త్వరలో మరో రూ.24 లక్షల చెక్కును అందజేస్తామని టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో ఐఎంఎకు భవనం లేకపోవడం బాధాకరమన్నారు. కర్నూలు నుంచి దేశవిదేశాలలో ప్రఖ్యాతి గాంచిన వైద్యులు ఉన్నారని అన్నారు. ప్రతి రోజూ సమావేశాలు నిర్వహించేందుకు ఐఎంఎకు ఒక శాశ్వత భవనం కచ్చితంగా అవసరమన్నారు. సమాజానికి ఉపయోగపడే సేవ కార్యక్రమాలు చేయడంలో టీజీవి సంస్థలు ఎప్పుడు ముందుంటాయని భరత్ అన్నారు. అనంతరం ఐఎంఎ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ బాలమద్దయ్య మాట్లాడుతూ.. అడిగిన వెంటనే రూ.50 లక్షల విరాళం ప్రకటించిన ఎంపీ టీజీ వెంకటేశ్, టీజీ భరత్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రామచంద్ర నాయుడు, మాలకొండయ్య, శివ శంకర రెడ్డి, రామ మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు