
కర్నూలు జిల్లా టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గా గణేష్ సింగ్ నియామకం
కర్నూలు టౌన్, జూన్ 11, (సీమకిరణం న్యూస్) :
తెలుగుదేశం పార్టీ కర్నూల్ జిల్లా లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గా న్యాయవాది గణేష్ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మౌర్య ఇన్ లో కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పదవి వచ్చేందుకు సిఫారసు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఆయనకు సూచించారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అనంతరం కర్నూల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డిని కలిశారు.