భయానికి భద్రతా కవచం మా బెటాలియన్
ఎస్ ఐ టీ. వెంకటరమణ
నెల్లూరు, ఆత్మకూరు, మర్రిపాడు, జూన్ 11, (సీమకిరణం న్యూస్) :
ప్రజలు ప్రశాంతంగా ఎన్నికలకు వచ్చి ఓటు వేసేందుకు రక్షణగా శాంతియుత విధానంలో తాము ఉన్నామని భయానికి భద్రతా కవచం మా బెటాలియన్ అంటూ తెలిపే ఉద్దేశంతో కవాతు నిర్వహించారు పోలీసులు.
ఆత్మకూరు ఉప ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్ ఐ వెంకటరమణ తెలిపారు. శనివారం నాడు ఆయన మర్రిపాడు మండలం లోని వెంకటాపురం, చాబోలు, కృష్ణాపురం, కంప సముద్రం గ్రామాలలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా పోలీసులను సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వేసుకోవాలని కోరారు. ఓటర్లను ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.