సహయంలో.. సరిలేరు మీకెవ్వరూ..!
– ఆపదలో ఆపన్న హస్తాలు టిడిపి నాయకులు
– బివి గెలుపుకు.. దూకుడు పెంచిన నాయకులు
ఎమ్మిగనూరు టౌన్, జూన్ 12, (సీమకిరణం న్యూస్) :
ప్రార్థించే పెదవుల కన్నా.. సాహయం చేసే చేతులు మిన్న అన్న ఇదే స్పూర్తితో ముందుకెళుతున్నారు పట్టణ టీడీపీ నాయకులు. వారే ఓ సైన్యంగా.. ప్రజా సేవలో నిరంతరం కృషి చేస్తున్న తీరు చూస్తుంటే ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం గా మారి పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి కష్టాల్లో తోడుగా మేమున్నాం అంటూ ధైర్యాన్ని ఇస్తున్నారు. దీంతో సహాయం చేయడంలో సరిలేరు మీకెవ్వరూ..! అంటున్నారు పట్టణ ప్రజలు.
ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు బివి.జయనాగేశ్వర రెడ్డి ఆదేశాలు మేరకు ముస్లిం మైనారిటీ టిడిపి పట్టణ అధ్యక్షుడు కె.ఎం.డి ఫారుక్, 4 వార్డు కౌన్సిలర్ రామదాస్ గౌడ్, మున్నా, గుల్లా సలాం, పులికొండ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ టిడిపి ఔదార్యాన్ని ప్రజలు ప్రశంసించారు. వివరాల్లోకి వెళ్తే…పట్టణంలోని స్థానిక సొగనూర్ రోడ్డు నందు ఉన్నటువంటి రహిమాన్ మరియు జమురుద్దీన్ దంపతులకు ఇద్దురు కొడుకులు,ఇద్దరు కుమార్తెలు సంతానం. జన్మించిన అనతికాలంలోనే ఆ తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించారు.ఆ నలుగురు పొట్ట కూటి కోసం కూలీ పనులకు వెళ్లి జీవనం సాగించేవారు. అయితే ఆ కుటుంబంపై విధి వారి పాలిట శాపంగా మారింది. 35 సం తమ్మడు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు.మృతి చెందిన కొంతకాలనికే అన్నా మతిస్థిమితం దెబ్బతినడంతో ఇద్దరు ఆడపిల్లలు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి మేమున్నాం అంటూ ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించారు. దీంతో వార్డు ప్రజలు టిడిపి ఔదార్యాన్ని ప్రశంసించారు. కష్టాల్లో ఉన్న వారికి టిడిపి పార్టీ ఆండగా ఉంటుందని.. పేద కుటుంబాలను గుర్తించి వారికి సహయం చేయడంలో ఎప్పుడు ముందుంటామని పేద కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు. అయితే పట్టణ టిడిపి నాయకులు మాత్రం టిడిపి పార్టీ గెలుపు కోసం దూకుడు పెంచినట్లు తెలుస్తోంది.