ఉమ్మడి జిల్లాలలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి.. జెఏసి
జర్నలిస్టుల పిల్లలకు కార్పోరేట్, ప్రెవేట్, స్కూల్స్,కాలేజీలలో 100 శాతం ఫీజులు లేకుండా రాయితీ ఇవ్వాలి..ఉమ్మడి జిల్లాల జర్నలిస్టు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసి) డిమాండ్
కర్నూలు టౌన్, జూన్ 13, (సీమకిరణం న్యూస్):
ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు కు సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జెఏసి ఉమ్మడి జిల్లాల కన్వీనర్ టి.జి.ప్రసాద్ ఉమ్మడి జిల్లాలలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నా సమస్యలను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు కు వివరించారు.ఈ సందర్భంగా జెఏసి ఉమ్మడి జిల్లాల కన్వీనర్ టి.జి.ప్రసాద్ కో కన్వీనర్స్ జి.రామకృష్ణ,బత్తిన నవీన్,అబ్దుల్ సత్తార్, యూ.సుబ్రహ్మణ్యం,పి.చంద్రయ్య,వినయ్, రాజశేఖర్,దస్తగిరి,వి.విజేయి మాట్లాడుతూ జిల్లాలోని అనేక మంది అక్రిడేషన్ లేక అనేక సంవత్సరాలు పని చేసిన జర్నలిస్టులకు అక్రిడేషన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ మంజూరు చేయగరని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో ఇండ్లు,ఇండ్ల స్థలాలు లేక అనేక సంవత్సరాల నుండి అద్దె ఇండ్లలో నివాసం ఉంటూ సొంత ఇల్లు కోసం ఎదురుచూస్తున్నారని వాటి సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు..అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్లు స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చాలీచాలని వేతనాలతో రాత్రి పగలు పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు కార్పోరేట్, ప్రెవేట్, స్కూల్స్,కాలేజీలలో 100 శాతం ఫీజులు లేకుండా రాయితీ ఇప్పించే విధంగా చూడాలని జిల్లా జర్నలిస్ట్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కలెక్టర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అండ్ సోషల్ మీడియా వ్యవస్థాపక అధ్యక్షులు యస్.కే. నజీర్, ఏపిడబ్ల్యూజేఎఫ్, ఎపిజెఎఫ్, ఆర్జెఎఫ్, ఏపీబీజేఏ, ఎంజెఎస్ఎస్, వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్, ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు శ్రీనాథ్ రెడ్డి,ఎస్.ఎం.డి.ఇస్మాయిల్, మల్లికార్జున యాదవ్, రమేష్, మల్లికార్జున నాయుడు. రాఘవేంద్ర గౌడ్. నరసింహ. నరసయ్య. రవి. నరసింహ రాజు. ఆంజనేయులు. చెన్నయ్య,సత్యం, కృష్ణ,సురేష్,అంజి,రాజు, వెంకట్,ఖాసీం. శ్రీనివాసులు పాల్గొన్నారు
డిమాండ్స్….
1. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ మంజూరు చేయాలి..
2. అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్లు స్థలాలు మంజూరు చేయాలి
3. జర్నలిస్టుల పిల్లలకు కార్పోరేట్, ప్రెవేట్, స్కూల్,కాలేజీలలో 100 శాతం ఫీజులు లేకుండా రాయితీ ఇవ్వాలి
4. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
5. అన్యాక్రాంతం అవుతున్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు రక్షణ కల్పించాలి
అభివందనలతో…..
టి.జి.ప్రసాద్
ఉమ్మడి జిల్లాల కన్వీనర్
ఉమ్మడి జిల్లాల జర్నలిస్టు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసి) కర్నూలు