మీ రక్షణ మా బాధ్యత ..
సురక్షితంగా ఓటుహక్కు వినియోగించుకోండి..
సంరక్షణగా మీ వెంట మేముంటాం….
పల్లెల్లో బెటాలియన్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ
నెల్లూరు, ఆత్మకూరు, మర్రిపాడు, జూన్ 12, (సీమకిరణం న్యూస్):
ఆత్మకూరు నియోజకవర్గంలో జూన్ 23న జరిగే ఉప ఎన్నికలకు మర్రిపాడు మండల గ్రామాల ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి భయానికి ప్రజలు గురికాకుండా తమ రక్షణ సామర్ధ్యాన్ని
పల్లె ప్రజలకు గడప ముంగిట స్థానిక రక్షణ వలయాధికారి టి.వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివారం సమస్యాత్మక,సాధారణ గ్రామాలు తిమ్మా నాయుడు పేట,సింగనపల్లి, నాగినేనిగుంట,, బ్రహ్మణపల్లి గ్రామాలలో ఫ్లాగ్.మార్చ్. సెంట్రల్ బెటాలియన్ కవాతు నిర్వహించారు.ఈ సందర్బంగా సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఆత్మకూరు ఉప ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా పోలీసులను సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వేసుకోవాలని కోరారు. ఓటర్లను ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్.ఐ. హెచ్చరించారు.