లక్ష ఓట్ల మెజారిటీ మన లక్ష్యం.
లక్ష ఓట్ల మెజారిటీ మన లక్ష్యం.
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, జూన్ 12, (సీమకిరణం న్యూస్) :
మేకపాటి విక్రమ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఈ15వ తేది ఉదయం 11గంటలకు ఆత్మకూరు,రవితేజ కళ్యాణమండపం నందు YSRCP ముస్లిం మైనారిటీల సంఘీభావ సమావేశం జరుగును.పార్టీ ఆదేశాల మేరకు ఆత్మకూరులో నిర్వహించనున్న మైనారిటి సదస్సుకు ఆహ్వానం పలుకుతూ జిల్లా YSRCP మైనారిటీ వింగ్ అధ్యక్షులు సయ్యద్ హంజాహుస్సేని AS పేట మండల YCP కన్వీనర్ శ్రీ పందిళ్ళపల్లి సుబ్బారెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా హంజా హుస్సేని ఏ ఎస్ పేట పేట మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సందాని బాష, ఏ ఎస్ పేట మండల యూత్ ప్రెసిడెంట్ షేక్ షౌకత్ అలీ, అనుమసముద్రం గ్రామ ఉప సర్పంచ్ షేక్ షేరాజ్ అలి, ఏ ఎస్ పేట మైనారిటి నాయకులు సయ్యద్ అబ్దుల్ రషీద్,షేక్ రహమత్ నవాజ్, నాయబ్ ఖాన్ తదితరులను కలసి ఆత్మకూరు మైనారిటి సదస్సు విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది. ఈ సదస్సుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి , Dy CM అంజాద్ బాషా , వ్యవసాయ శాఖా మాత్యులు, కాకాణి గోవర్థన్ రెడ్డి ,తంబళ్లపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి , రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ మరియు రాష్ట్ర మైనారిటీ అద్యక్షులు Vఖాదర్ బాషా , ఆత్మకూరు YCP అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఇతర YCP నాయకులు పాల్గొంటారు, కావున మన ఏ ఎస్ పేట మండలంలోని అన్ని పంచాయతీల ముస్లింలు వందలాదిగా పాల్గొనవలసిందిగా కోరారు.