ఉప ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు
సీఐ వేణుగోపాల్ రెడ్డి
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, జూన్ 12 (సీమకిరణం న్యూస్) :
ఆత్మకూరు ఉప ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఆత్మకూరు సిఐ జి.వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు ఈనేపథ్యంలో ఏఎస్ పేట మండలం చిరమన గ్రామంలో మార్చ్ వాక్ (భద్రతా ర్యాలీ)ను సాయుధ దళం సి ఆర్ పి ఎఫ్ పోలీసులు..స్థానిక పోలీస్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని గ్రామాలలో పోలీస్ బెటాలియన్ తో మార్చ్ నిర్వహించడం ద్వారా ప్రజలకు భద్రతా భావం తో ఎన్నికలకు వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఐ తెలిపారు అనంతరం స్థానిక ఎస్ఐ షేక్ సుభాని మాట్లాడుతూ మండల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన అన్నారు ప్రజలందరూ సమానం పాటించి ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అన్నారు ఈ మార్చ్ లో సి ఆర్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ సిఆర్పిఎఫ్ సిబ్బంది స్థానిక పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.మండలంలోని చిరమన, మదరరాబాద్, జమ్మవరం, కాకర్ల పాడు, గుంపర్లపాడు గ్రామాలలో మార్చ్ వాక్ నిర్వహించారు